ఖమ్మం రైల్వే స్టేషన్ పనులను స్పీడప్​ చేయండి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం రైల్వే స్టేషన్ పనులను స్పీడప్​ చేయండి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను స్పీడప్​చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్టేషన్ లోపల జరుగుతున్న పనుల పురోగతి గురించి ఎస్ఎస్ఈ అఖిల్, సీసీఐ ఎండీ.జావిద్, రైల్వే అధికారులు మోహన్ కుమార్, అనిల్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో మార్చిలోపు పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని అధికారులను  ప్రశ్నించారు.

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని, అసౌకర్యం కలగనివ్వొద్దని సూచించారు. ఎస్కులేటర్, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ ఎదుట ఓ టీ స్టాల్ వద్దకు కాంగ్రెస్ నాయకులతో కలిసి చాయ్ తాగారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.