సెబీ చీఫ్​పైనా ఎంక్వైరీ జరిపించాలి.. అదానీని వెంటనే అరెస్ట్​ చేయాలి : రాహుల్​గాంధీ

సెబీ చీఫ్​పైనా ఎంక్వైరీ జరిపించాలి.. అదానీని వెంటనే అరెస్ట్​ చేయాలి : రాహుల్​గాంధీ

న్యూఢిల్లీ: అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్​ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్​ అగ్రనేత, ఎంపీ రాహుల్​గాంధీ డిమాండ్​ చేశారు. ఈ కేసుతో అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించినట్టు తేలిందని వ్యాఖ్యానించారు. ఇండియన్​ఆఫీసర్స్​కు 250 మిలియన్​ డాలర్ల లంచం ఇచ్చారనే ఆరోపణలపై అమెరికా ప్రాసిక్యూటర్లు అదానీ, అతడి సహచరులపై అభియోగాలు మోపిన కొన్ని గంటల తర్వాత  రాహుల్​గాంధీ  గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అదానీ, మోదీ భారత్​లో ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటారని ‘మోదీ ఏక్​హై తో సేఫ్​ హై స్లోగన్’​ను ఉటంకిస్తూ  రాహుల్​గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘అదానీని తక్షణమే అరెస్టు చేసి, విచారించాలి.  ఆయనను రక్షిస్తున్న సెబీ చైర్​పర్సన్ మాధబి పూరిబచ్​ను పదవినుంచి తొలగించి, ఎంక్వైరీ జరిపించాలి. తాజా ఆరోపణలపై జేపీసీతో విచారణ చేపట్టాలి” అని డిమాండ్​ చేశారు. 

పార్లమెంట్​లో ప్రస్తావిస్తం

సోమవారం నుంచి  ప్రారంభం కానున్న పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో అదానీపై కేసు అంశాన్ని ప్రస్తావిస్తామని రాహుల్​గాంధీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, ఈ అంశంపై ప్రశ్నలు సంధిస్తామని తెలిపారు.  ‘‘భారత్​లో అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు’’ అని రాహుల్​ గాంధీ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ  విశ్వసనీయత కోల్పోయారు. అదానీ, ప్రధాని ఒక్కటేనని దేశం మొత్తానికి తెలుసు.  మేం అందరి సంబంధాలను బహిర్గతం చేస్తం. ఇందుకు మాధబి బుచ్​ మొదటి ఉదాహరణ” అని పేర్కొన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి విచారిస్తే విషయాలన్నీ బయటపడతాయన్నారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ కోరారు. 

నిగ్గు తేల్చాలి: ఖర్గే

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్  కంపెనీల కార్యకలాపాలు, విదేశాల్లో పెట్టుబడులపై జాయింట్​పార్లమెంట్ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్​లో స్పందించారు. దేశంలోని పెద్ద కంపెనీలపై అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే విచారణ చేపట్టాలని, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. దేశంలోని కీలక రంగాల్లో కొందరికే ఆధిపత్యం ఇవ్వడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక రంగంలో ఇలాంటి అనైతిక బంధాలకు, విధానాలను కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకమన్నారు. పీఎం మోదీ, అదానీ బంధం దేశం మొత్తం తెలుసని, ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారులు, పొలిటికల్​లీడర్ల పాత్రను నిగ్గుతేల్చాలన్నారు. అదానీపై వచ్చిన ఆరోపణలు దేశంలోని ఎంఎస్​ఎంఈ, స్టార్టప్​లపై తీవ్ర ప్రభావం చూపుతాయని, భవిష్యత్తులో చిన్న కంపెనీల్లోకి పెట్టుబడులు రావడం కష్టంగా మారుతుందన్నారు.  రాహుల్​ గాంధీ చెప్పినట్టు.. అదానీ నుంచే విచారణ ప్రారంభం కావాలని డిమాండ్​ చేశారు.