వీల్ చైర్ క్రికెట్ జాతీయ టోర్నీ విజేతలకు ఎంపీ అభినందన

వీల్ చైర్ క్రికెట్ జాతీయ టోర్నీ విజేతలకు ఎంపీ అభినందన

ఖమ్మం, వెలుగు : నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 5న ఒడిశాలో జరగగా, జట్టును విజేతగా నిలపడంలో భాగస్వాములైన జిల్లా వీల్ చైర్ క్రికెట్ క్రీడాకారులను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి  అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్ కే. సమీరుద్దీన్, బండి రాము, జె. సురేశ్, హైదరాబాద్ కు చెందిన రమావత్ కోటేశ్వర్, మహమ్మద్ సమీలతో కలిసి తాము గెలిచిన ట్రోఫీని శనివారం ఖమ్మంలో ఎంపీ రఘురాంరెడ్డికి చూపించగా వారందరినీ ఆయన సత్కరించారు. 

ఎంతో పట్టుదలతో జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభను చాటి, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు పాపా నాయక్ తదితరులు పాల్గొన్నారు.