శంకర్పల్లి, వెలుగు : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపాలిటీలో రూ. 45లక్షలతో నిర్మించిన చిల్ర్డన్స్ పార్క్ ని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్చైర్పర్సన్విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్క్ లో ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులను పరిశీలించి, పార్క్ ఆవరణలో మొక్క నాటారు.
ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోని అన్నిరాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్శశిధర్రెడ్డి, కౌన్సిలర్లుపాల్గొన్నారు.