వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. నేను ఆసమయంలో వేరే పార్టీ లో వున్నా.. కానీ ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ఏనాడు విమర్శించలేదన్నారు. YSR కూతురు షర్మిలమ్మ కొత్త పార్టీ పెడుతుందని టీవీల్లో చూశానన్న రేవంత్…ఆమె తెలంగాణకు ఆడబిడ్డ లాంటిదన్నారు. రాజన్న బిడ్డగా వస్తే.. హక్కున చేర్చుకుంటామన్నారు. కానీ తెలంగాణలో పార్టీ పెడితే ఇక్కడ ఎవరు ఊరుకోరన్నారు. జగన్ అన్న కూడా షర్మిల పార్టీ నాకు తెలియదని అన్నారని చెప్పారు. ఇది జగన్ అన్న వదిలిన బాణం కాదు.. సీఎం కేసీఆర్ వదిలిన బాణమన్నారు.
పోతిరెడ్డు పాడు, సంగమేశ్వర్ ప్రాజెక్టుపై కొట్లాడుతావా అంటూ షర్మిలను..ప్రశ్నించారు ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ వద్దని అడ్డుపడిన వాళ్ళ కారణంగా..వందలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. మీ అన్న జగన్ నుకాదని..తెలంగాణ కోసం కొట్లాడుతావా అని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసిన వాళ్లు.. ఇక్కడ పార్టీ పెడితే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ బిడ్డలు పాలించాలో ఆలోచించాలంటూ ప్రజలను కోరారు. వైఎస్ ఆర్ విగ్రహాలు కాపాడుకుందాం, జయంతి, వర్థంతులను ఘనంగా జరుపుకుందాం..కానీ పార్టీ పెడ్తామంతే.. ఉరుకోబోమన్నారు.షర్మిల పార్టీ పెడుతున్నారని పదిరోజులుగా ప్రచారం జరుగుతుంటే.. సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పై TRS అధినేత, సీఎం కేసీఆర్ రాజకీయ కుట్రకు తెరలేపారన్నారు.దీనిపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రైతులకు మద్దతుగా అచ్చంపేట నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టిన ఎంపీ రేవంత్ రెడ్డి…ఠాగూర్ సినిమాలో ఏ విదంగా ప్రతి ఒక్కరు ముగ్గురికి హెల్ప్ చేస్తారో.. అలాగే ఈ పాదయాత్ర ను యువకులు వీడియో తీసి ప్రతి ఒక్కరు ఐదుగురికి పంపాలని కోరారు.