రేవంత్​ ఓ కబ్జా కోరు

ఆ ఫాం హౌస్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ లీజుకు తీసుకున్నదే- టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎంపీ రేవంత్‌‌‌‌ రెడ్డి కబ్జా కోరు అని, కేటీఆర్​ ఫామ్​ హౌజ్​ పేరుతో డ్రామా చేశారని టీఆర్ఎస్​ నాయకులు ఆరోపించారు. ఫాం హౌస్‌‌‌‌ పేరుతో డ్రామా చేసిన రేవంత్‌‌‌‌  కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయాడని ఎగతాళి చేశారు. రేవంత్​కు సంబంధమున్న గోపన్‌‌‌‌పల్లి భూకబ్జా నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దళితుల భూమిని కబ్జా చేసిన రేవంత్‌‌‌‌ బ్రదర్స్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణ్‌‌‌‌రావు, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, శంభీపూర్‌‌‌‌ రాజు, గట్టు రామచంద్రరావు, బాల్క సుమన్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌‌‌‌ తన భార్య పేరుతో 8.9 ఎకరాల భూమిని కొన్నారని, ఆ విషయాన్ని 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్నారని తెలిపారు. కేటీఆర్‌‌‌‌ ఫామ్​హౌస్‌‌‌‌ అంటూ రేవంత్‌‌‌‌ చూపించిన స్థలానికి, కేటీఆర్‌‌‌‌  కొన్న భూమి 8 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ఆ ఫామ్​ హౌస్‌‌‌‌ను కేటీఆర్‌‌‌‌ నాలుగేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారని, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులందరికీ ఆ విషయం తెలుసని చెప్పారు. రేవంత్‌‌‌‌  ఆరోపణల్లో రవ్వంత కూడా నిజం లేదని.. వెంటనే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

For More News..

చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!