ముంబై: పెట్రో రేట్ల పెరుగుదలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయని.. ఇప్పుడు ద్రవ్యోల్బణం, పెట్రో ధరలు పెరుగుతాయన్నారు. ‘ఇది బీజేపీ ఆడుతున్న గేమ్. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం, కశ్మీర్ ఫైల్స్ మూవీ లేదా హిజాబ్ వివాదం సమస్యలు కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే అసలైన సమస్యలు’ అని రౌత్ పేర్కొన్నారు. కాగా, దేశీయ చమురు కంపెనీలు వరుసగా రెండో రోజూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి. తాజాగా లీటరు పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరింది.
Maharashtra | Fuel prices are rising... now that the elections are over, inflation is back. This is BJP's game. The real issue is not the war between Russia & Ukraine or the movie 'The Kashmir Files' or hijab, it's inflation & unemployment: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/q3fCs4Duis
— ANI (@ANI) March 24, 2022
For More News..