- ఎంపీ సోయం బాపురావు
ఇచ్చోడ, వెలుగు : పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ సోయం బాపూరావు బీజేపీ కార్యకర్తలకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్‌తో కలిసి మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలో కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, బోథ్ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరవేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు లింగారెడ్డి, భూమయ్య, మాదవ్ రావ్ తదితరులున్నారు.