ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూత పడ్డ సీసీఐ (cotton corporation of India) వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షను ఎంపీ సోయం బాపురావ్ రైతుల చేత విరమింపజేశారు. గతంలో ఉన్న నేతలకు సోయి లేకపోవడం వల్ల సీసీఐ ఓపెన్ కాలేదని ఆయన అన్నారు. సిసిఐ రి ఒపెన్ కోసం ఢిల్లీలో ధర్నాకైనా సిద్ధమని, వచ్చే ఏడాదికల్లా సీసీఐ ని తెరిపిస్తామని ఎంపీ అన్నారు.
సీసీఐ తెరిపించకుంటే తనగల్లా పట్టుకొని నిలదియొచ్చని , ఇంకోసారి ఓట్లు కూడా అడగనని రైతులతో ఆయన అన్నారు. గతంలో ఎంపీ లుగా ఉన్న గొడెం నగేష్, వేణుగోపాల చారిని కాలర్ పట్టుకొని నిలదీయాలని వారికి తెలిపారు.
చిల్లర రాజకీయాలు మానుకో
తాను పక్క రాజకీయ నాయకుడిగా మారితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఇంట్లో నుండి కూడా బయటకు రాలేడని అన్నారు. ఇన్నేళ్లు గడ్డి తిన్న జోగురామన్న, ఇప్పుడు రాజకీయ లబ్దికోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నాడన్నారు ఎంపీ. అతిగా మాట్లాడితే రామన్నకు టి.ఆర్.ఎస్ టికెట్ కూడా రాకుండా చేస్తానని బాబురావు అన్నారు.