ఖానాపూర్,వెలుగు: సదర్మాట్ కాల్వ తాత్కాలిక మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని, ఈ విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల 17న రైతులతో కలిసి తామే పనులు చేస్తామని ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. గురువారం ఆయన సదర్మాట్ కాల్వను కిసాన్ మోర్చా నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. రైతుల సమస్యలను ఖానాపూర్ ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదన్నారు. కడెం మండలం లింగా పూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయానికి ఎంపీ నిధుల నుంచి ఫండ్స్ మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అజ్మీర హరినాయక్, అసెంబ్లీ కన్వీనర్ పడాల శేఖర్, కో–కన్వీనర్ గడ్డం నంది రెడ్డి, పెంబి జడ్పీటీసీ జానుబాయి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సందుపట్ల శ్రావణ్, ఖానాపూర్, కడెం, పెంబి పార్టీ మండలాధ్యక్షులు టేకుప్రకాశ్, ధర్మాజీ కిష్టయ్య,తులాల సదాశివ, లీడర్లు భీంరావు, తలారి రాజేందర్, ఎనగందుల రవి, మామిడాల సుధాకర్, ముక్కెర గంగాధర్, రైతు నాయకులు రాజేందర్, రామగిరి రంజిత్, సాయి, కడెం శక్తి కేంద్రం ఇన్ చార్జి పడాల రాజేశ్, గొలుసుల మల్లేశ్, స్వామి, రాజు విజయ్, వీరాచారి, జక్కుల సురేశ్, భూమన్న రాజేశ్‌యాదవ్, శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
గూడెంలో షర్మిల పాదయాత్రకు స్వాగతం
దండేపల్లి, వెలుగు: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర గురువారం సాయంత్రం 6గంటలకు జగిత్యాల జిల్లా నుంచి గూడెంకు చేరింది. ఈ సందర్భంగా గోదావరి బ్రిడ్జి దగ్గర ఆమెకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గూడెం, కన్నెపల్లి, మీదుగా లక్సెట్టిపేట చౌరస్తాకు చేరుకుంది. రాత్రి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వసతిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు లక్సెట్టిపేట నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇటిక్యాల, అంకత్పల్లి, సూరారం, గుల్లకోట మీదుగా హాజీపూర్ మండలం దొనంబండ, హాజీపూర్ నుంచి ధర్మారం వరకు సాగుతుంది. పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా హాజీపూర్‌లోని బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ఎదురుగా వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. అనంతరం పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.
బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ తగదు
మందమర్రి,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనుల్లో కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణను ప్రోత్సాహిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్ అలీ ఆరోపించారు. గురువారం ఏరియా కాసిపేటగనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఏరియాలోని కాసిపేట1,2, శాంతిఖని గనుల్లో ప్రైవేటు ఎస్డీఎల్ నడిపించేందుకు కాంట్రాక్టర్లు వేసిన టెండర్లు అడ్డుకోవడంలో టీబీజీకేఎస్, టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్నారు. టీబీజీకేఎస్కాంట్రాక్టీకరణకు మద్దతు పలికి బయట ఆందోళనల పేరుతో డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రైవేటీకరణను అధికార పార్టీ ఎమ్మెల్యులు, ఎంపీలు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను అడ్డుకొని సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మికవర్గం పోరాటాలకు రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు గని కార్మికులు, ఏఐటీయూసీ లీడర్లు గని ఆవరణలో ర్యాలీ నిర్వహించి గని మేనేజర్ అల్లావుద్దీన్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్,బియ్యాల వెంకటస్వామి, బ్రాంచి వైస్ప్రెసిడెంట్ఇప్పకాయల లింగయ్య, మీనుగు లక్ష్మీనారాయణ, ఎస్.నాగేశ్వరరావు, రత్నం ఐలయ్య, ఆడెపు రవీందర్, కోల కమలాకర్, శ్రీహరి, డి. నర్సయ్య, సపాట్ రాయమల్లు, జంగు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
మూడేండ్లు గడుస్తున్నా.. అభివృద్ధి ఏదీ?
రామకృష్ణాపూర్,వెలుగు: చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో మూడేళ్లుగా అభివృద్ధి పనులు చేపట్టడంలేదంటూ బీజేపీ ఆధ్వర్యంలో శిలాఫలకాలకు పిండప్రదానం చేశారు. గురువారం రామకృష్ణాపూర్ రాజీవ్‌చౌక్ వద్దగల పార్టీ టౌన్ ప్రెసిడెంట్మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వివిధ అభివృద్ధి పనుల కోసం 22 శిలాఫలకాలు వేసి మూడేండ్లు పూర్తయ్యాయన్నారు.సీఎం దత్తపుత్రుడిగా చెప్పుకునే బాల్క సుమన్‌ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడితే వందల కోట్ల ఆస్తులు కూడబెట్టే పనిలో ఉన్నాడని ఆరోపించారు. స్థానిక కౌన్సిలర్లు సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. నిరసనలో పార్టీ సీనియర్ లీడర్లు ఆరుముళ్ల పోశం, మల్లయ్య, బీసీ మోర్చా ప్రెసిడెంట్ వీరమల్ల పాలరాజయ్య, టౌన్ వైస్ ప్రెసిడెంట్లు మల్లయ్య, సంఘ రవి, నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేశ్,మహిళ మోర్చా ప్రెసిడెంట్ లక్ష్మి, లీడర్లు అశోక్, రాజేందర్, ధన్సింగ్, శివ, శ్యాం, ముద్దసాని శ్రీనివాస్, కళాధర్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, కునమల్ల బాబు, బాలాజీ, ఊషన్నతదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే తనిఖీలు
ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్
నస్పూర్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ చెప్పారు. గురువారం అరుణక్క నగర్ లో ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. పేపర్స్ సరిగాలేని 67 మోటార్ సైకిల్స్, మూడు ఆటోలు, టాటా మ్యాజిక్ సీజ్ చేసినట్లు తెలిపారు. క్రైం కంట్రోల్ కోసం తనిఖీలు తప్పనిసరన్నారు. కొత్తవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఉద్యోగాల సాధన కోసం పట్టుదలతో చదివాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే యువతకు ఎలాంటి ఉద్యోగాలు రావన్నారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. టూవీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పని సరన్నారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ బి. రాజు, ఎస్ఐ మానస, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొనపనారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నిర్మల్,వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతా చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధర చెల్లింపు, తూకం, గన్ని సంచులు, రవాణా తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకుముందు మంత్రి మామడ మండంలోని న్యూసాంగ్వి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ, జిల్లా మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు.
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ
భైంసా (బాసర), వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని వీసీ వెంకటరమణ సూచించారు. గురువారం బాసర ట్రిపుల్ఐటీలోని కాకతీయ గ్రౌండ్లో క్రికెట్ నెట్ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సెక్యూరిటీ ఔట్ పోస్టు ఆఫీస్‌ను ప్రారంభించారు. ఇది విద్యార్థులకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. నిత్యం విద్యార్థులు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. వెయ్యి మంది విద్యార్థులకు కళ్ల అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నాణ్యమైన వస్తువులనే అమ్మాలి: ఏసీపీ
మందమర్రి,వెలుగు: వ్యాపారులు క్వాలిటీతో కూడిన వస్తువులను అమ్మితేనే వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతుందని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్చెప్పారు. గురువారం స్థానిక మార్కెట్ఏరియాలో వ్యాపారులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వస్తువులకు ప్రయారిటీ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన మందమర్రి మార్కెట్వ్యాపారుల సంఘం బాధ్యులను అభినందించారు. కార్యక్రమంలో మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, వ్యాపారుల సంఘం ప్రెసిడెంట్ తమ్మిశెట్టి విజయ్, జనరల్ సెక్రటరీ మంద తిరుమల్ రెడ్డి, ట్రెజరర్ గుడ్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ బత్తుల సతీశ్‌బాబు, అరసవెల్లి బాలాజీ, చీఫ్ అడ్వైజర్ గ౦ప ఆంజనేయులు, గడ్డం అనిల్, బందెల కృష్ణ, మటూరు పవన్, కమ్మంపాటి ఆంజనేయులు, శ్రీకాంత్, శ్రీనివాస్, గోనె సత్యం, సంతోష్‌చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లు ప్రారంభం
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 7 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గురువారం బెల్లంపల్లి, తాండూర్‌లో క్వింటాలుకు రూ.8,100 ధర పలికిందన్నారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి నాణ్యమైన పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని ఆదేశించారు. ఈ సీజన్లో జిల్లాలో 1.54 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా, 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేస్తున్నామని అన్నారు. మిగతా 5 సెంటర్లలో సోమ, మంగళ వారాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి, జన్నారంలో కొనుగోళ్లు జరుపుతామన్నారు. జిన్నింగ్ మిల్లుల్లో రోజుకు 2,750 బేళ్ల సామర్థ్యం ఉందన్నారు. తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉండాలని, 6, 7 శాతం ఉంటే బోనస్ చెల్లిస్తామని తెలిపారు. డీఏవో కల్పన, మార్కెటింగ్ ఆఫీసర్ గజానంద్, మార్కెట్ కమిటీల సెక్రటరీలు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
కన్నులపండువగా పండరీపూర్ యాత్ర
ఆదిలాబాద్‌టౌన్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభమైన పండరీపూర్పాదయాత్ర గురువారం ఆదిలాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని ఏటా పండరీపూర్ యాత్ర నిర్వహిస్తామన్నారు. విఠలేశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.