నేను పార్టీ మారడం లేదు: సోయం బాపురావు

  • కాంగ్రెస్లో చేరుతున్నానని తప్పుడు ప్రచారం
  • ఇలాంటి కథనాలు ప్రచురిస్తే లీగల్గా చర్యలు
  • ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారని, బీజేపీలో కొనసాగుతానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కర్నాటకలో గెల వగానే.. దేశం మొత్తం విజయం సాధిం చినట్టు సంబరాలు చేసుకుంటోందన్నా రు. తను పార్టీ మారుతున్నట్టు తప్పుడు కథనాలు ప్రచురించిన వారికి న్యాయపర మైన చర్యలు తీసుకుంటానని బాపురావు చెప్పారు. తన కుమారుడి పెళ్లికి ఆహ్వా నించేందుకు ఇతర పార్టీల నేతలను కలిశానని, దానికి బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ కు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సైతం పెండ్లి పత్రికలు అందిస్తానని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మహేశ్వర్ రెడ్డితో విభేదాలుండేవని, ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవన్నారు.