- కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ సోయం వినతి
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా హైదరాబాద్ వరకు రైల్వే లైన్ పూర్తి చేసి జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు విన్నవించారు. గురువారం న్యూఢిల్లీలో మంత్రిని కలిసి జిల్లాలోని రైల్వే సమస్యలను విన్నవించారు. 2017లో మంజూరైన ఆదిలాబాద్–పటాన్చెరువు రైలు మార్గాన్ని పూర్తిచేస్తే ఆదివాసీలకు ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు.
ALSO READ :రైల్వే ఉద్యోగి.. రైలు కింద పడి ఆత్మహత్య
ఇప్పటివరకు పటాన్చెరువు నుంచి బోధన్ వరకు మాత్రమే సర్వే పనులు పూర్తయ్యాయని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే పనులు వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రి ఇందుకు సానుకూలంగా స్పందించారని, ఆదిలాబాద్ రైల్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. ఆయన వెంట బీజేవైఎం నాయకులు రాళ్ల బండి మహేందర్ ఉన్నారు.