రోడ్డు పనులకు సీఆర్ఐఎఫ్ నిధులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్, బేల రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీఆర్​ఐఎఫ్​( కేంద్ర రోడ్లమౌలిక సదుపాయాల నిధులు) రూ. 40.24 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ సోయం బాపురావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో నిరాల గ్రామం నుంచి ఆడ, లాండసాంగ్వి మీదుగా సీసీఐ వరకు 15 కిలోమీటర్ల మేరా రహదారి విస్తరణతో పాటు రోడ్డు నిర్మాణం పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వర్షాకాలం కంటే ముందుగానే పూర్తి చేయాలని ఎంపీ సోయం బాపూరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి అయితే రోడ్డు ఇబ్బందులు తొలగుతాయన్నారు.