- ఎంపీ సోయం బాపురావు
ఆదిలాబాద్, వెలుగు: తన సొంత అవసరాల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నారంటూ కొంత మంది నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సోమవారం ఎంపీ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో సొంత పార్టీ నేతల హస్తం ఉందని మండిపడ్డారు. గతంలో సైతం తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. రైతువేదిక, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మన ఊరు మనబడి అభివృద్ధి పనులు ప్రారంభించారు.