బజార్ హత్నూర్, వెలుగు : ఆదివాసీ యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంపీ సోయం బాపూరావు కుమారుడు సోయం వెంకటేశ్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని చింతల సంగ్వీ గ్రామంలో ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ ను ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భగా మాట్లాడుతూ. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెరుగుతుందన్నారు. యువకులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. నేతలు పటేల్ భీంరావు, దేవారి భూమన్న, మహాజన్ హనుమంతు, ఆదివాసీ యూత్ అద్యక్షుడు సిడాం సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.