
ఆదిలాబాద్టౌన్, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన మరాఠా కులస్తులతో కలిసి జాతీయ బీసీ సంక్షేమశాఖ చైర్మన్ హన్సరాజ్ గంగారాంను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణలోని మరాఠాలకు బీసీ గుర్తింపు ఉన్నా కేంద్ర పథకాలు, ఉద్యోగాలకు ఓబీసీ అర్హత అందడం లేదన్నారు. దీనికి స్పందించిన చైర్మన్ మరాఠాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయ్ బోయర్, దశరథ్ పాటిల్, మురళీధర్, దత్తానికం, సందీప్, తదితరులు పాల్గొన్నారు.