హాస్టల్ నుంచి విద్యార్థిని కిడ్నాప్.. రూ.30 లక్షలు డిమాండ్

హాస్టల్ నుంచి విద్యార్థిని కిడ్నాప్.. రూ.30 లక్షలు డిమాండ్

రాజస్థాన్ కోటాలో కోచింగ్ తీసుకోవడానికి వెళ్లిన యువతి హాస్టల్ నుంచి కిడ్నాప్ అయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అసలు ఆ యువతి ఇన్‌స్టిట్యూట్, హాస్టల్‪లో జాయిన్ అయినట్లు ఆధారాలే లేవని పోలీసులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లోని శివపురికి చెందిన 21ఏళ్ల యువతిని కోటాలో హాస్టల్ నుంచి కిడ్నాప్ చేసి రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయిని బంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు ఆ యువతి కిడ్నాప్ అయినట్లు ఇంకా కంఫామ్ కాలేదని అంటున్నారు. 

2023 ఆగస్ట్ లో తన కుమార్తెను కోచింగ్ కోసం కోటాలోని ఓ ఇన్ట్సిట్యూట్ లో చేర్పించాడని, ఆమె విజ్ఙాన్ నగర్ పోలీస్ స్టేషన్ పిరధిలోని ఓ హాస్టల్ నివసిస్తోందని తండ్రి చెబుతున్నాడు. తండ్రి ఫిర్యాదుతో సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేశామని, దాని ఆధారంగా ఇన్విస్టిగేషన్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ అమ్మాయి  తండ్రి చెప్పినట్లుగా హాస్టల్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినట్లు రికార్డ్స్ లో ఏలాంటి ఆధారాలు లేవని పోలీస్ ఆఫీసర్ చౌదరి చెప్తున్నారు. తాళ్లతో కట్టేసి ఉన్న అమ్మాయి ఫొటోలు  సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతే కాదు ఆమె తండ్రికి కాల్ చేసి రూ.30లక్షలు డిమాండ్ కూడా చేశారని యువతి తండ్రి చెబుతున్నాడు.  మొత్తానికి ఇదో మిస్టరీ కేసులా ఉంది. 

ALSO READ :- PSL 9 Final: ఫైనల్ మ్యాచ్‌లో స్మోకింగ్.. పాక్ క్రికెటర్‌పై విమర్శలు