యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలి : ఎంపీ సురేశ్​ షెట్కార్

యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలి : ఎంపీ సురేశ్​ షెట్కార్
  • కేతకీ ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ సురేశ్​ షెట్కార్

ఝరాసంగం, వెలుగు: కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయడానికి నూతన పాలక వర్గం కృషి చేయాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ సురేశ్​కుమార్ షెట్కార్​అన్నారు. సోమవారం కేతకీ ఆలయంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన 11 మంది ధర్మకర్తలతో ఉమ్మడి మెదక్​ జిల్లా ఎండోమెంట్​సూపరింటెండెంట్​యువరాజ్​ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేతకీ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. 

ఆలయ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్​ తయారు చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకవర్గందే అన్నారు. అనంతరం చైర్మన్, ధర్మకర్తలను శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్​చైర్మన్​గిరిధర్​రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్​అంజయ్య, టీఎస్​ఐడీసీ మాజీ చైర్మన్​తన్వీర్, మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్​రావు పాటిల్, ఆలయ ఈవో శివరుద్రప్ప పాల్గొన్నారు.

పేదల అభివృద్ధే కాంగ్రెస్​ లక్ష్యం

నారాయణ్ ఖేడ్: పేదల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ మండలం రుద్రారం, పగిడిపల్లి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగంపై చేసిన ఆరోపణలను ప్రజలందరూ అర్థం చేసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల కుప్పగా మార్చిందన్నారు. 

కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక వాళ్లు చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ  ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్, కాంగ్రెస్ ఖేడ్ ఇన్​చార్జి ధనలక్ష్మి, వినోద్ పాటిల్, శ్రీకాంత్ రెడ్డి, బాబాఖాన్, జనార్ధన్, తాహెర్ అలీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, పండరి రెడ్డి  పాల్గొన్నారు.