ప్రజల మనిషి శివరావ్ షెట్కార్ : ఎంపీ సురేశ్ షెట్కార్

నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రజల కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని, అలాంటి నేతనే శివరావ్ షెట్కార్ అని ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. సోమవారం శివరావ్ షెట్కార్ 29వ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఖేడ్ ప్రజల అభివృద్ధి కోసమే పరితపించిన వ్యక్తి శివరావ్ షెట్కార్ అన్నారు. 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఏకైక ఫ్యామిలీ షెట్కార్ ఫ్యామిలీయే అన్నారు.

అంతకుముందు ఆయన సమాధి వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సురేశ్ షెట్కార్ కుటుంబ సభ్యులు, నగేశ్ షెట్కార్, చంద్ర శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.