మీరేంటీ.. మీ వయస్సు ఏంట్రా: ముగ్గురు పిల్లలు.. ఓ బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అత్యంత పాశవిక ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని కామాంధులు.. ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటన బిర్లా గ్రామ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లసుదియా జైసింగ్‌ గ్రామంలో చోటు చేసుకుంది. 

బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఈ అకృత్యానికి పాల్పడ్డ ముగ్గురిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మూడవ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కరణ్ సింగ్ వెల్లడించారు.

నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు గతంలో ఇలాంటి అకృత్యాలకు ఏమైనా పాల్పడ్డరా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.