హుజూర్‌నగర్, వెలుగు : హుజూర్‌నగర్‌లో అధికార పార్టీ నాయకుల భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుజూర్‌నగర్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కోసం పర్యటించిన మంత్రి కేటీఆర్ ను ఉత్తమ్ కలిశారు. అనంతరం క్యాంప్ ఆఫీస్ లో ఉత్తమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.540 సర్వే లో అధికార పార్టీ నాయకుల ఆక్రమించుకున్న 46 ఎకరాల అటవీ భూములను స్వాధీనం చేసుకుని, కబ్జాదారులపై చర్యలు తీస్కోవాలని కేటీఆర్‌ను కోరినట్లు చెప్పారు. అలాగే హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో వంద కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని చెప్పగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.
హుజూర్‌నగర్ లో తాను సేకరించిన భూముల్లో బంజారాభవన్ లు, పల్లె ప్రకృతి వనాలు, ఇతర ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారని, నాడు తాను మొదలుపెట్టిన పనులకే మళ్లీ ఇప్పుడు కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నారని చెప్పారు.