హుజూర్‌నగర్, వెలుగు :హైదరాబాదులో జరిగే కాంగ్రెస్ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ లో శుక్రవారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆత్మీయ సభను జరిపారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మొదటిస్థానంలో నిలిచినట్టే , ఈ సభకు కూడా తరలిరావాలని అన్నారు. వైఎస్ ఆర్టీపీ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ బహిరంగ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్ళాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం స్ధాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పెద్దిరెడ్డి రాజా, గోదాల రంగారెడ్డి, శనగాని రాంబాబు, వడ్డె ఎల్లయ్య, ముదిరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్ లు వెలుగు వెంకన్న, నామా ప్రవీణ్ పాల్గొన్నారు.
ALSO READ: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్వీ కర్ణన్
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విజయం
కోదాడ : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కు 12 స్థానాలను, రాష్ట్రంలో 70 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొని అధికారంలోకి వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు. బీ ఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తోందన్నారు.