సాగర్‌‌‌‌‌‌‌‌ గురించి మాట్లాడడం విడ్డూరం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్ నగర్, మేళ్లచెరువు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినా స్పందించని సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌  గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాళేశ్వరం కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందని, లక్ష కోట్ల అప్పు తెచ్చి కట్టిన ప్రాజెక్టు ఎకరాకు కూడా నీళ్లివ్వకుండానే కుంగిపోతోందని ఆరోపించారు.

తానే ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ అయ్యి ప్రాజెక్టు నిర్మించానని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సాగర్ నిర్మించి 60 ఏండ్లైనా చెక్కుచెదరకుండా ఉందని, ఏటా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని స్పష్టం చేశారు.  సంక్షేమ పథకాలు నామినేషన్ల లోపులో  ప్రజలకు అందజేయాలని తాను చెబితే..  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు తాను పథకాలు ఆపుతున్నానని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ALSO READ : కాంగ్రెస్ గెలిస్తే పేకాట క్లబ్బులొస్తయ్ : బడుగులు లింగయ్య యాదవ్

నేతలు సుబ్బారావు,  వెంకటేశ్వర్లు,  అప్పిరెడ్డి, చక్రధర్ రావు,  వీరారెడ్డి,  శివారెడ్డి,  మల్లిఖార్జున రావు,  గిరిబాబు,   శ్రీనివాస్ గౌడ్ , భాస్కర్ రెడ్డి, కొండారెడ్డి, రామచందర్ రావు, సైదేశ్వర్ రావు, గోవిందరెడ్డి  పాల్గొన్నారు.