ఎమ్మెల్యేల అవినీతితో విసిగిపోయిన ప్రజలు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 

హుజూర్ నగర్, నేరేడు చర్ల, వెలుగు : హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగి పోయారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  సోమవారం హుజూర్ నగర్ మున్సిపల్ చైర్‌‌పర్సన్‌ గెల్లి అర్చనా రవి, కౌన్సిలర్లు గాయత్రి భాస్కర్, అమరబోయిన సతీశ్,  గుంజ భవాని,  కోతి సంపత్ రెడ్డి, శోభనాద్రిగూడెం సర్పంచ్ రామారావు,  నేరేడుచర్ల పరిధిలోని రామాపురం మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నేతలు,  అమాయక ప్రజలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారని మండిపడ్డారు .  

దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలకు కేవలం బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. మూడెకరాల భూపంపిణీ,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసే లేదన్నారు. రెండు నియోజకవర్గాల్లో 50 వేలకుపైగా మెజార్టీతో  గెలుపొందుతామని ధీమా వ్యక్తం  చేశారు.   కొణతం చిన్న వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి , పాలకవీడు ఎంపీపీ భూక్యా గోపాల్, నేతలు మల్లికార్జున్,  శ్రవణ్ ,  వరలక్ష్మి నాగరాజు , సరిత వీరారెడ్డి , రాజా నాయక్ ,  విజయ వెంకటేశ్వర్లు , ధనమ్మ  పాల్గొన్నారు.