తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు వేల రూపాయల పింఛన్ ను నాలుగువేల రూపాయలకు పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
కోదాడలో కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు కూడా తగ్గదన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గ్రామాలకు డబుల్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 100 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయిస్తామన్నారు.