రాష్ట్రపతి భవన్​ లో బ్రేక్​ ఫాస్ట్ కు హాజరైన ఎంపీ వద్దిరాజు

రాష్ట్రపతి భవన్​ లో బ్రేక్​ ఫాస్ట్ కు హాజరైన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం, వెలుగు : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎంపీలకు రాష్ట్రపతి భవన్​ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. సహచర ఎంపీలు సురేశ్​ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి రాష్ట్రపతి భవన్ లో అల్పాహారం తీసుకున్నారు. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందునిచ్చారు.