
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఎర్రుపాలెం, వెలుగు : వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెంలో వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఈనెల 27న జరిగే సభ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తప్పు చేశామని వారు బాధపడుతున్నారని ఆయన తెలిపారు. అడగని పథకాలు సైతం ఆచరణలో అమలు చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.
వరంగల్ సభకు వాహనాల ఏర్పాటు, సదుపాయాల కల్పనపై జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సమీక్షించారు. అంతుకుముందు వారు అంబేద్కర్ ఫొటోకు పూలమాలల వేసి నివాళులర్పించారు. వరంగల్ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శీలం కవిత, గ్రామ సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు.