రాష్ట్ర భవిష్యత్తు పిల్లలే.. చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలి: ఎంపీ వంశీ కృష్ణ

రాష్ట్ర భవిష్యత్తు పిల్లలే.. చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలి: ఎంపీ వంశీ కృష్ణ

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ క్రమంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా మంథని లో ఇంటెగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేసు కోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లలే అని.. వారు చదువు కొని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు.

గతంలో గురుకుల పాఠశాలలో సౌకర్యాలు లేని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 28 గురుకుల పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. అంబేద్కర్ చెప్పినట్లు రైట్ టు ఎడ్యుకేషన్ ఆదర్శంగా తీసుకొని కాక వెంకటస్వామి అంబేద్కర్ విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ విద్యాసంస్థల్లో 5000 మంది నిరుపేద విద్యార్థులు సబ్సిడీపై చదువుకుంటున్నారని అన్నారు.

Also Read : పదేళ్లు ఆగిన అభివృద్ధిని పునః ప్రారంభించాం

అంబేద్కర్ ఆదర్శంతో కాకా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల్లో చదివి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలబడ్డారని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుందని.. అందరు చదువుకొని పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు.తల్లి తండ్రులు తమ పిల్లలను  మంచి చదువులు చదివించి ప్రోత్సహించాలని కోరారు వంశీకృష్ణ.