ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వెల్గటూర్ మండలంలోని ఐకెపి సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశి క్రిష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకులు జరగకుండా రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం రేవంత్ అన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సన్నాధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించిందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని.. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. 

గత ప్రభుత్వం తరుగు పేరుట దోపిడీ చేసి రైతులను నిండా ముంచిందని అన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని.. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్, సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తరుగు పేరిట మిల్లర్లు దోపిడీ చేస్తే చర్యలు తప్పవు హెచ్చరించారు ఎంపీ వంశీకృష్ణ. ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగేలా చూడాలని అధికారులకు సూచించారు.