తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల కోసం ప్రత్యేక నిధులివ్వండి :  ఎంపీ వంశీకృష్ణ

తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల కోసం ప్రత్యేక నిధులివ్వండి :  ఎంపీ వంశీకృష్ణ
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బొగ్గు గనుల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. రాష్ట్రంలో బొగ్గు గనుల పునరుద్ధరణ కోసం ప్రత్యేక నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి, సహచర ఎంపీలతో వంశీకృష్ణ వెళ్లి  కలిశారు.

తెలంగాణలో బొగ్గు గనుల అంశాన్ని, కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రికి ఎంపీ వంశీకృష్ణ వివరించారు. బొగ్గు గనుల ప్రాముఖ్యత, ప్రాంతీయ అభివృద్ధి, స్థానిక ప్రజల ఉపాధి మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బొగ్గు గనుల సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు  వంశీకృష్ణ  తెలిపారు.