పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ఎంపీ వంశీకృష్ణ బర్త్‌‌‌‌‌‌‌‌ డే

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ఎంపీ వంశీకృష్ణ బర్త్‌‌‌‌‌‌‌‌ డే

పెద్దపల్లి/ధర్మారం, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ బర్త్‌‌‌‌‌‌‌‌ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఎంపీ బర్త్‌‌‌‌‌‌‌‌డే కేక్​కట్​ చేశారు. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు సయ్యద్​సజ్జాద్​ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో రోగులకు అల్పాహారం అందజేశారు. ఉనుకొండ శ్రీధర్​ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో వేడుకలు నిర్వహించి రోగులకు భోజనం అందజేశారు. ఓదెల మల్లన్న ఆలయంలో వంశీకృష్ణ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మారం మండల కేంద్రంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్​ బర్త్​డే కేక్​ కట్​ చేసి వేడుకలు నిర్వహించారు.  వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో గోపగాని సారయ్యగౌడ్, సురేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్, బండారి సునీల్, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌, గంగుల సంతోష్, ఐలయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌, ధర్మారం మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, లీడర్లు అశోద అజయ్, అరిగే లింగయ్య, దేవి జనార్ధన్, చిరంజీవి, కిశోర్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని మాతంగి కాలనీవాసులు ఎంపీ గడ్డం వంశీకృష్ణ బర్త్​డే సందర్భంగా సోమవారం రాత్రి కేక్​ కట్​ చేసి ఆయన ఫెక్లీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్టీపీసీ కాలుష్యం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను వంశీకృష్ణ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారన్నారు.