కార్మికుల రక్షణే ద్యేయంగా సింగరేణి అధికారులు పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రామగుండం సింగరేణి ఆర్జీ-2 లో మైన్ యాక్సిడెంట్ పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా తీశారు. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీ సింగరేణి అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. రామగుండం సింగరేణి ఆర్జీ-2 ప్రమాదంలో హెడ్ ఒర్మెన్ సత్యనారాయణ మృతి చెందడం చాలా బాధాకరమని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. 

సింగరేణి లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రెస్క్యూ టీమ్ ఏర్పాటై చేయాలని..  సింగరేణి అధికారులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆధునిక పరిజ్ఞానం పెరుగుతున్నా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే కారణం అవుతుందని అన్నారు.కార్మికుల రక్షణే ద్యేయంగా సింగరేణి అధికారులు పనిచేయాలని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.