దేశాన్నిమంచి మార్గంలో నడిపే సత్తా టీచర్లకే ఉంది: ఎంపీ వంశీకృష్ణ

దేశాన్నిమంచి మార్గంలో నడిపే సత్తా  టీచర్లకే ఉంది: ఎంపీ వంశీకృష్ణ

దేశాన్ని మంచిమార్గంలో నడిపే  సత్తా కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. మంచి గురువు వల్లే మంచి వ్యక్తులు తయారవుతారని చెప్పారు. ఓ మనిషి జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని అతిపెద్ద వేడుకగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత లక్ష్యాలకు చేరాలంటే చదువే ఏకైక మార్గమని చెప్పారు. జగిత్యాల కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వంశీకృష్ణ  

దేశంలో ఒక గురువు  సెల్ఫ్ సాక్రిఫై జాబ్  అని  వంశీకృష్ణ అన్నారు. ఒక విద్యార్థి తన గోల్ తో ముందుకు సాగాలంటే గురువుతోనే సాధ్యమవుతుందన్నారు.   కాకా వెంకటస్వామి  చదువే బలం, చదువు ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారన్నారు. హైదరాబాద్ లో బీఆర్ అంబేద్కర్ కాలేజీలో బడుగు, బలహీన వర్గాల వారికి ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. సంవత్సరానికి 5వేల మంది పిల్లలను చదివిపిస్తున్నామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలను పైకి తేవడానికి ఆయుధం కేవలం ఒక చదివేనని, అది గురువులతో సాధ్యమవుతుందన్నారు.  స్త్రీలను, మహిళలను గౌరవించడం పిల్లలకు చిన్నప్పటినుంచి చెప్పాలన్నారు.