
- నేతకాని భవనం పునఃనిర్మాణానికి రూ.50 లక్షల మంజూరుపై హర్షం
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల పట్టణం హమాలి వార్డులోని నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా భవనం పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రుణపడి ఉంటామని తెలంగాణ నేతకాని హక్కుల సేవా సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్, జిల్లా సీనియర్ నేత ముడిమడుగుల మహేందర్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
2023లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీని నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా భవనం పునఃనిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో భవనంలో రెండో అంతస్తు నిర్మించనున్నట్లు చెప్పారు. సమావేశంలో నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా నేత జాడి మహేశ్, గట్టు బానేశ్, గట్టు శివలింగయ్య, గోమాస సత్యనారాయణ, బాదం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.