ఎలాంటి అవాంతరాలు లేకుండా పత్తి కొనుగోళ్లు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎలాంటి అవాంతరాలు లేకుండా పత్తి కొనుగోళ్లు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్ బెల్ట్, వెలుగు: పత్తి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సీసీఐ ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకుంటున్నారని పెద్లపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పత్తి కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా పలువురు  రైతులు మాట్లాడుతూ..  ఆధార్​సర్వర్​పని చేయకపోవడంతో  పది రోజులుగా సీసీఐ సెంటర్లలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డామని, ఎంపీ వంశీకృష్ణ చొరవతో తమ  కష్టాలు తీరిపోయాయని పేర్కొన్నారు.   సీసీఐ ఆఫీసర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ఎంపీకి ఈ సందర్భంగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీని కలిసిన ఆటో డ్రైవర్లు

నస్పూర్​ మండలం కృష్ణకాలనీ ఆటో యూనియన్​ బాధ్యులు, డ్రైవర్లు శుక్రవారం మంచిర్యాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఎంపీని కలిసిన వారిలో ఐఎన్టీయూసీ లీడర్​ మారుతీ, ఆటో యూనియన్​ ప్రెసిడెంట్​రాగిడి రాజు, ఉపాధ్యక్షులు ఎనగందుల వెంకటేశ్, గుడికాందుల శివ, కోశాధికారి బొబ్బల కుమార్, ప్రధాన కార్యదర్శి ఎండీ  రహీం, ప్రచార కార్యదర్శి చిలుముల క్రాంతి, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.