పెద్దపల్లి, ధర్మారం, వెలుగు : ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్ తండ్రి రత్తనాయక్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బంజేరుపల్లి గ్రామంలోని రూప్లానాయక్ నివాసంలో రత్తనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే ఖోఖో మహిళల వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు సహాయ కోచ్‌గా పని చేస్తున్న ఇస్లావత్ నరేశ్‌నాయక్‌ను ఫోన్‌లో అభినందించారు. రామగుండం ఎన్టీపీసీ ఏరియాలో కార్యకర్త సిద్దిక్ వివాహం ఇటీవల జరిగింది. వాళ్ల ఇంటికి వెళ్లిన ఎంపీ.. కొత్త జంటను ఆశీర్వదించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ధర్మారం, పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.