కూనారం రైల్వే బ్రిడ్జి త్వరగా కంప్లీట్ అయ్యేందుకు కృషి చేస్తా: ఎంపీ వంశీ

కూనారం రైల్వే బ్రిడ్జి త్వరగా కంప్లీట్ అయ్యేందుకు కృషి చేస్తా: ఎంపీ వంశీ

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని కూనారం రైల్వే బ్రిడ్జి త్వరగా అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ హామీ ఇచ్చారు. శుక్రవారం (మార్చి 7) ఎంపీ వంశీ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు.  ఈ సందర్భంగా పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం -కూనారం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 

గత రెండు సంవత్సరల క్రితం ప్రారంభమైన రైల్వే బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. బ్రిడ్జి పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‎తో మాట్లాడి త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే.. పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ ‎‎తో పాటు చుట్టూ పక్కల ఉన్న గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. 

ALSO READ | ఎండాకాలం.. తాగునీటి సమస్య ఉండొద్దు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి