రైతుల కళ్లలో ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం: ఎంపీ వంశీకృష్ణ

రైతుల కళ్లలో ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లో మంత్రి శ్రీధర్ బాబుతో ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు.ఇద్దరు నేతలు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరు టౌన్ లోని పలు కాలనీల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆతర్వాత పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, అధికారులు పాల్గొన్నారు.

3 విడతల్లో రైతు రుణమాఫీ చేశామని... టెక్నికల్ ఇష్యూస్ తో రుణమాఫీ కాని వారికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీ చేసి రైతుల్లో ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నేతలు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడి పోయిందన్నారు. తాము మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్దే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలిపారు.

పదేళ్ల BRS పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు MLA వెంకటస్వామి. చెన్నూరు టౌన్ లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 30 కోట్లతో పనులు మొదలు పెడతామన్నారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అభివృద్ధి కొనసాగిస్తామని చెప్పారు ఎమ్మెల్యే. చెన్నూరు టౌన్ లో పర్యటించిన వివేక్... పలు కాలనీల్లో  స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా శ్రీనగర్, కొత్తగూడెం, MLA  కాలనీ, బైపాస్ రోడ్డు లో బైక్ పై పర్యటించి సమస్యలపై ఆరా తీశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

హైదరాబాద్ లో ఫాం హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 30 మీటర దూరంలో రూల్స్ పాటించే ఫాంహౌస్ కట్టామన్న వివేక్..బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరిచారు. చెన్నూరు MLA క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. చట్టానికి లోబడే పనులు జరిగాయాన్నారు.

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులైన 80 మంది మహిళా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఓవైపు పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబుతో ఎంపీ వంశీకృష్ణ..మరోవైపు చెన్నూరు టౌన్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.