భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ వంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని బార్అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు.
ఇప్పటికే రూ. వంద కోట్లు కేటాయించిందని, దీనిని భవిష్యత్‌లో రూ. 500 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వారికి ఇండ్ల స్థలాలు, హెల్త్ ఇన్స్‌రెన్స్ రూ.5లక్షలకు పెంచుతామన్నారు. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల భవన సముదాయాలకు ప్రభుత్వం కొత్తగూడెంలో 10 ఎకరాల స్థలం కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నేత ఎడవల్లి కృష్ణ పాల్గొన్నారు.
పాల్వంచలో ప్రచారం..
పాల్వంచ పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీ, శివానగర్, బాలాజీ నగర్, వెంకటేశ్వర హిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను రూ. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ALSO READ : నమ్మకమా.. అతినమ్మకమా? తేడా కొట్టిందంటే అంతే సంగతులు!