ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ ద్వారా స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు నిఖార్సయిన నాయకుడైతే తన ప్రశ్నలకు జవాబివ్వాలంటూ ట్వీట్ చేశారు విజయసాయి.
తిరుమల వెయ్యికాళ్ల మండపం, విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చారంటూ ప్రశ్నించారు.దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేసారని, బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం చేసి తమపై నిందలు మోపారని, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం మీద విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
~ వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ మత్తుకుమిల్లి (@sribharatm) మరియు శ్రీ నారా లోకేష్ (@naralokesh) తోడల్లుళ్లు కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలిలో మా ప్రైవేట్ స్థలం లో ఈరోజు మళ్ళి రెండవసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్నా! నారా చంద్రబాబు నాయుడు @ncbn నివసిస్తున్న కృష్ణానది…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2024
చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదని అన్నారు. ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు చంద్రబాబును ఛీ కొడుతున్నారని అన్నారు. ప్రసాదంలో ఏ కల్తీ లేదని, కల్తీ అంతా చంద్రబాబు బుర్ర, మనసు, చరిత్రలోనే ఉందని అన్నారు.ఆరోపణలే తప్ప చంద్రబాబు జీవితంలో నిరూపణలు ఉండవని మండిపడ్డారు.విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా అంటూ ధ్వజమెత్తారు.
దేవదేవుడు చంద్రబాబును ఎప్పటికి క్షమించడని అన్నాడు. కలియుగంలో చంద్రబాబు అంత పాపం ఎవరూ చేసి ఉండరని, తన ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశారని అన్నారు.చంద్రబాబు లాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టమని అన్నారు విజయసాయిరెడ్డి.