మేము ఏ కూటమిలో చేరం.. మాది న్యూట్రల్ స్టాండ్ : ఎంపీ విజయసాయి రెడ్డి

మేము ఏ కూటమిలో చేరం.. మాది న్యూట్రల్ స్టాండ్ : ఎంపీ విజయసాయి రెడ్డి

వైసీపీ ఏ కూటమిలో చేరదని.. తమ పార్టీది న్యూట్రల్ స్టాండ్ అని అన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఇండియా కూటమి, ఎన్డీఏకు తమకు సమాన దూరం అని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై తమ పార్టీ అద్యక్షుడి అభిప్రాయమే చెబుతామని అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఏపీ ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యమని అన్నారు విజయసాయిరెడ్డి. ప్రాథమిక దశలో ఉన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకించలేమని అన్నారు.

సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇదే ప్రెస్ మీట్లో పాల్గొన్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు చెప్పిన పని చేయలేదని  అన్నారు. ఆయన చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారని అన్నారు అమర్నాథ్.

ALSO READ | మన తిరుపతిలోనే ఈ ఘోరం: అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ

నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అమ్మకాలకే పరిమితమైందని అన్నారు. తమ హయాంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించామని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు అమర్నాథ్.