2 తలలు, 3 చేతులతో పుట్టిన బిడ్డ

2 తలలు, 3 చేతులతో పుట్టిన బిడ్డ

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు రెండు తలలు, మూడు చేతులు, నాలుగు పాదాలు ఉండడంతో ఆశ్చర్య పోవడం వైద్యులు వంతైంది. విధిశా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. విదిషా జిల్లాలోని సుజా గ్రామానికి చెందిన జస్వంత్ అహిర్వార్, బబితా అహిర్వర్ లకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చిన  బబితా..  ఈ నెల 23 న 3.3 కిలోలున్న ఓ శిశువు కి జన్మనిచ్చింది.

పుట్టిన బిడ్డకు రెండు తలలు, మూడు చేతులు, నాలుగు పాదాలు ఉన్నాయని విదిషా జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ సంజయ్ ఖరే తెలిపారు. విదిషాలో నమోదైన తొలి అరుదైన కేసు ఇదని అన్నారు. సాధారణంగా, స్త్రీ గర్భంలో పిండం సరిగా అభివృద్ధి చెందనప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని, ఈ పరిస్థితి లక్షల్లో ఒకరికి సంభవిస్తుందని ఆయన చెప్పారు..

బిడ్డ తండ్రి  జస్వంత్ అహిర్వర్  మాట్లాడుతూ..  పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో ఉంచబడ్డాడని చెప్పాడు. అయితే ఆరోగ్యం క్షీణించడం వల్ల  మెరుగైన చికిత్స కోసం శిశువును భోపాల్ లోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపాడు.

MP Woman Gives Birth to Baby with Two Heads, Three Hands