2026 లోపు బిల్డ్ ​ఇన్ హెడ్ ట్రాకింగ్ సెన్సార్..​ ఆడియో ఎంపీ 3 ఫార్మాట్ ఆవిష్కర్త : బీబీ ల్యాబ్స్​ సీఈవో బ్రాండెన్​బర్గ్​

2026 లోపు బిల్డ్ ​ఇన్ హెడ్ ట్రాకింగ్ సెన్సార్..​ ఆడియో ఎంపీ 3 ఫార్మాట్ ఆవిష్కర్త : బీబీ ల్యాబ్స్​ సీఈవో బ్రాండెన్​బర్గ్​

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: 2026 లోపు ఆధునాతన పరిజ్ఞానంతో కూడిన బిల్డ్ ​ఇన్​ హెడ్ ట్రాకింగ్ సెన్సార్​ ఆడియోలను తీసుకురాబోతున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత ఆడియో టెక్నాలజీ మార్గదర్శకుడు, బీబీ ల్యాబ్స్ జీఎంబీహెచ్​ సీఈవో కార్ల్​ హీన్డ్​ బ్రాండెన్​ బర్గ్ పేర్కొన్నారు. జర్మనీలోని ఇల్మెనావ్​ టెక్నికల్​యూనివర్సిటీ సీనియర్​ ప్రొఫెసర్​ అయిన బ్రాండెన్​బర్గ్​ పటాన్​చెరు పరిధిలోని గీతం వర్సిటీలో మంగళవారం జరిగిన ఆడియో అకౌస్టిక్స్​ సిగ్నల్స్​ ప్రాసెసింగ్ సెమినార్​లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బర్గ్​ మాట్లాడుతూ .. ఆడియో కోడింగ్ పరిణామం, మ్యూజిక్​ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్​, స్పేషియల్​ఆడియో, హెడ్​ ఫోన్​ లిజనింగ్ టెక్నాలజీలు రాబోయే రోజుల్లో కొత్త పుంతలు తొక్కబోతున్నట్లు వివరించారు. ఎంపీ3 ఫార్మాట్ ఆవిష్కరణ తర్వాత ఓకియానోస్​ ప్రో, పీఏఆర్​టీవై (పార్టీ) వంటి అత్యాధునిక టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు చేశామని త్వరలోనే క్యూ4 ను తీసుకొస్తామని చెప్పారు.

గీతం ఈఈసీఈ బ్రాంచ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మరో అంశంలో న్యూఢిల్లీలోని సెరాఫిమ్​ కమ్యూనికేషన్స్​ ఫౌండర్​, సీఈవో సునందారావు ఎర్డెమ్​ జర్మనీలోని వృత్తి పరమైన అవకాశాలపై ప్రసంగించారు. యువ ఇంజినీర్లకు వరల్డ్​ కెరీర్​ అవకాశాలు, టెక్నాలజీ ఇన్నోవేషన్స్​కు జర్మనీ అనువైనదిగా ఆమె సూచించారు. కార్యక్రమంలో గీతం స్కూల్​ ఆఫ్​ టెక్నాలజీ డైరెక్టర్​ప్రొఫెసర్​ రామశాస్ర్తీ వేదాల, ఈఈసీఈ హెడ్​టి. మాధవి, సివిల్​ఇంజినీరింగ్ హెడ్​ చేపూరి అఖిలేశ్, ప్రొఫెసర్​ త్రినాథరావు పాల్గొన్నారు.