డిప్యూటెషన్ పై మనస్థాపం: MPDO ఆత్మహత్యాయత్నం

వేరే మండలానికి డిప్యూటెషన్ పై పంపడంతో మనస్థాపం చెందిన ఎంపీడీవో భారతి ఆత్మహత్యకు పాడ్డారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం లో MPDO గా బాధ్యలు నిర్విస్తున్నారు భారతి. ఆమెను సిరికొండ మండలానికి డిప్యూటెషన్ పై పంపించారు అధికారులు. అయితే తాను కుటుంబ సమస్యల కారణంగా సిరికొండ వెళ్లలేనని కొద్ది రోజుల వరకు డిప్యూటెషన్ ను నిలిపివేయాలంటూ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  కలిశారు ఎంపీడీఓ భారతి. తన డిప్యూటెషన్ ను ఆపాలని ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నా… ఎమ్మెల్యే సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపం చెంది  ఆత్మహత్య కు పాల్పడ్డారు ఎంపీడీఓ భారతి. మొదట ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిచారు. పరిస్థితి విషమించడంతో భారతిని హైదరాబాద్ కు తరలించారు డాక్టర్లు.