అనారోగ్యంతో ఎంపీడీవో మృతి

జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపీడీవో కరివేద మల్లారెడ్డి శుక్రవారం(జూన్ 23) తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

రెండు రోజుల క్రితం వరకు ఎంపీడీవో మల్లారెడ్డి విధులు నిర్వహించాడు. ఆయన మరణవార్త వినగానే స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు.