లింగంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పంచాయతీ సెక్రటరీలు పక్కాగా నిర్వహించాలని ఎంపీడీఓ నరేశ్అన్నారు. సోమవారం లింగంపేట మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు. ఇండ్లులేని నిరుపేదలతో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి గుడిసెల్లో నివాసం ఉంటున్నామనీ, తమకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ జొన్నలరాజు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు వంజరి ఎల్లమయ్య, అశోక్, నాయకులు రాజు, నగేశ్, రాజు, కిరణ్, కౌడ రవి, సలీం, సెక్రటరీ శ్రావణ్‌కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.