కూసుమంచి,వెలుగు : దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి రైతులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ ఆదేశాలతో కూసుమంచి మండలం పాలేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, డీటీ కరుణశ్రీ ప్రారంభించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏగ్రేడ్ ధర రూ,2320, బి గ్రేడ్ ధర రూ,2300 ధర ఉందని రైతులకు వారి ఎకౌంట్లలో డబ్బు పడతాయన్నారు. ఈకార్యక్రమంలో ఏఈఓ సౌమ్య, ఏపీఓ అప్పారావు, నాయకులు రాంరెడ్డి,బదావత్ నరేశ్ పాల్గొన్నారు.