ఎంపీడీవోలనుపాత జిల్లాలకు బదిలీ చేయాలి

ఎంపీడీవోలనుపాత జిల్లాలకు బదిలీ చేయాలి

మంత్రి సీతక్కకు  ఎంపీడీవోల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవోలను బదిలీ చేశారని, తిరిగి వారిని పాత జిల్లాలకు పంపించాలని ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెళ్లూరి  శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ అవరణలోని మంత్రి సీతక్క చాంబరులో  ఆమెను ఆ సంఘం నాయకులు కలిశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలక్షన్ల ట్రాన్స్ పర్ అనంతరం తొమ్మిది మంది హార్ట్ స్ట్రోక్ తో మరణించారని, గడిచిన 15 రోజుల్లో నలుగురు ఎంపీడీవోలు చనిపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారి సమస్య పరిష్కరించాలని కోరారు.  ఎంపీడీవోలకు ఇచ్చే వెహికల్ అలవెన్స్ రెండేండ్లుగా విడుదల చేయకపోవడంతో డ్రైవర్ల జీతాలు, ఫ్యూయల్ చార్జెస్స్ కు  ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.