ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు : శ్రీనివాస్ గౌడ్

ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు : శ్రీనివాస్ గౌడ్

నర్సాపూర్(జి), వెలుగు: మండల పరిధిలో ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నర్సాపూర్ జి మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో ఆయన ఆకస్మికతనిఖీలు చేశారు. ఓ ఫంక్షన్ హాల్, వైన్స్ షాప్​కు జరిమానా వేశారు. ప్లాస్టిక్ రహిత  మండలంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. పంచాయతీ కార్యదర్శి వీణ తదితరులు పాల్గొన్నారు.