మంకీపాక్స్ కలకలం: భారత్ లో రెండో కేసు నమోదు...

మంకీపాక్స్ కలకలం: భారత్ లో రెండో కేసు నమోదు...

భారత్ లో రెండో మంకీపాక్స్ కేసు నమోదయ్యింది.కేరళలోని మలప్పురం జిల్లాలో మరో కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ నిర్దారించారు. ఇటీవలే యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్‌ వైరస్ సోకిందని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితున్నట్లు మంత్రి తెలిపారు.

మంకీపాక్స్ బాధితుడు అనారోగ్యం కారణంగా మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడని, ఆ తరువాత మంజేరి మెడికల్ కాలేజీకి తరలించారని మంత్రి తెలిపారు. అతని శాంపిల్స్ పరీక్ష కోసం కాలికట్ మెడికల్ కాలేజీకి పంపగా... అతడికి మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

కాగా 9రోజుల క్రితం ఢిల్లీలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదయ్యింది. ఆఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనిని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.